తాండూరులో అంబరాన్నంటిన దసరా సంబరాలు ప్రజల జయజయధ్వానాల మధ్య ఘనంగా ఉత్సవాలు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరులో అంబరాన్నంటిన దసరా సంబరాలు

ప్రజల జయజయధ్వానాల మధ్య ఘనంగా ఉత్సవాలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చీఫ్ విప్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు అక్టోబర్ 22( తెలంగాణ వార్త ప్రతినిధి )

తాండూరు పట్టణంలో దసరా ఉత్సవాలు ప్రజల భాగస్వామ్యంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని బోనమ్మ గుడి సమీపంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. పండుగ వాతావరణంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.ఈ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలతో కలిసి దసరా ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో విజయాలు, శుభాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని పండుగ శోభను మరింత పెంచారు. ప్రజల భాగస్వామ్యంతో తాండూరులో దసరా ఉత్సవాలు ఘనంగా సంప్రదాయాలు, సంస్కృతికి దసరా వేడుకలు నిలిచారని తెలిపారు 

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతిరూపమైన విజయదశమి ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందని అన్నారు. ఇలాంటి ఉత్సవాలు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర స్నేహభావాన్ని, ఐక్యతను బలోపేతం చేస్తాయని తెలిపారు. తాండూరు ప్రజలందరికీ విజయాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా ఉత్సవాల్లో పాల్గొని ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజల భాగస్వామ్యం, సంప్రదాయాల పరిరక్షణతో తాండూరులో దసరా ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు యు రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్,డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ రవి గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగు, కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, విద్యావేత్తలు ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు