తాండూర్లో ఉత్కంఠభరితంగా ముగిసిన టీబీబీఎల్-(2026)జయకేతనం ఎగరేసిన బీఎస్ఆర్ జట్టు!
-విజేతలకు అభినందించిన ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, అక్టోబర్ 18 (తెలంగాణ వార్త ప్రతినిధి)
తాండూరు పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తాండూర్ బిగ్ బాష్ లీగ్’ (టీబీబీఎల్ – 2026) క్రికెట్ టోర్నమెంట్లో బీఎస్ఆర్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా బీఎస్ఆర్ జట్టు సాధించిన విజయంపై ఆర్బీఓఎల్ సీఈఓ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, విజేత జట్టు సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఐక్యత మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అలాగే శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. యువత గెలుపోటములను సమానంగా స్వీకరించి, ఉత్తమ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.తాండూరులో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా స్థానిక యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు, వారిలో పరస్పర స్నేహభావాన్ని పెంపొందించేందుకు చక్కటి అవకాశం కలుగుతుందనిఅభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ క్రీడాకారులు మరింత ఉత్సాహంతో పాల్గొని మరిన్ని విజయాలు సాధించి, తాండూరు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.