శనిగేశ్‌పూర్‌లో ఇసుక డంపుపై ఉత్కంఠ!

శనిగేశ్‌పూర్‌లో ఇసుక డంపుపై ఉత్కంఠ!

అక్రమమా.. సక్రమమా? పోలీసుల ఆరా.. రెవెన్యూ శాఖ ద్వారా అనుమతుల పరిశీలన

విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం: కరణ్‌కోట్ ఎస్‌హెచ్‌ఓ డి. అన్వేష్ రెడ్డి

తాండూరు, అక్టోబర్ 21 ( తెలంగాణ వార్త ప్రతినిధి)

వికారాబాద్ జిల్లా కరణ్‌కోట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శనిగేశ్‌పూర్ గ్రామ శివారులో ఈద్గా సమీపంలో ఇసుక డంపు చేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడ నిల్వ చేసిన ఇసుకకు సంబంధిత అధికారుల అనుమతులు ఉన్నాయా? లేక అక్రమంగా నిల్వ చేశారా? అనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

గ్రామ శివారులో ఇసుక నిల్వ ఉన్నట్లు సమాచారం రావడంతో ఈ వ్యవహారంపై స్థానికంగా చర్చ మొదలైంది. ఇసుక డంపునకు సంబంధించి అనుమతుల వివరాలను రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోనున్నట్లు కరణ్‌కోట్ ఎస్‌హెచ్‌ఓ డి. అన్వేష్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇసుక నిల్వకు సంబంధించిన పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇసుక నిల్వకు అనుమతులు ఉన్నాయా లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారుల పరిశీలన పూర్తయితేనే ఈ వ్యవహారంలోని వాస్తవాలు వెల్లడికానున్నాయి.