ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి తనయుడు అవినాష్ రెడ్డి హల్చల్.. నూతన వధూవరులకు ఆశీస్సులు!
తాండూరు నవంబర్ 1 తెలంగాణ వార్త ప్రతినిధి):-
తాండూరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన పలు వివాహ వేడుకల్లో తాండూరు శాసనసభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి తనయుడు, యువనేత బుయ్యాని అవినాష్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పట్టణంలోని వివిధ ఫంక్షన్ హాళ్లలో జరిగిన శుభకార్యాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ల సుఖసంతోషాలతో దంపత్య జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తనయుడి రాకతో కళ్యాణ వేదికల వద్ద కోలాహలం నెలకొంది. ఈ కార్యక్రమాల్లో తాండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవినాష్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. వారితో పాటుమున్సిపల్ చైర్మన్ నీరజ బాల్రెడ్డి, కోట బాస్ పల్లి సర్పంచ్ సరూప వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ నాయకులు రవీందర్ గౌడ్ ఎమ్మార్వో మహేష్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, రాసునం మల్ రెడ్డి, చెంగోల్ రాము యాదవ్, కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప, పాల్గొన్నారు
