నిరుద్యోగులకు ‘బిఎమ్‌ఆర్’ కొండంత అండ! అర్జునుడి పక్షి కన్నులా… మీ లక్ష్యం ‘పోలీస్ ఉద్యోగమే’ కావాలి!ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

నిరుద్యోగులకు ‘బిఎమ్‌ఆర్’ కొండంత అండ!

పోటీ పరీక్షల ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తాండూరు రూపురేఖలు మార్చేలా ఎమ్మెల్యే బిఎమ్‌ఆర్ సేవలు

తాండూరు అక్టోబర్ 28 (తెలంగాణ వార్త ప్రతినిధి ):-పేద, నిరుద్యోగ యువత ఉన్నత ఉద్యోగాలు సాధించి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ‘బిఎమ్‌ఆర్ ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని విలేమున్ హైస్కూల్‌లో బిఎమ్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 300 మంది అభ్యర్థులకు ఉచిత పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే కృషిని, బిఎమ్‌ఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా కొనియాడారు. స్పీకర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఉపాధి కల్పనలో ముందంజగతంలో కూడా బిఎమ్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బృహత్తరమైన జాబ్ మేళా నిర్వహించి వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. అదే బాటలో నేడు పోలీస్ కానిస్టేబుల్, ఇతర ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల సాధన కోసం శిక్షణ ఇస్తూ, ఉచిత మెటీరియల్ అందించడం వారి నిబద్ధతకు నిదర్శనం సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయితాండూరు నియోజకవర్గంలోని నిరుపేద యువతకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడానికి తాండూరు ఎమ్మెల్యే ముందు వరుసలో ఉంటారు. నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న ఆయన కృషి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అన్నారు.మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోవాలి: “ఉచితంగా లభించిన ఈ నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ను శిక్షణ పొందుతున్న 300 మంది అభ్యర్థులు శ్రద్ధతో చదివి సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించడం ద్వారా మీ కుటుంబానికి, సమాజానికి, వికారాబాద్ జిల్లాకు మరియు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి కోరారు…

తాండూరు ఎమ్మెల్యే బుయాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అర్జునుడి పక్షి కన్నులా… మీ లక్ష్యం ‘పోలీస్ ఉద్యోగమే’ కావాలి!ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిఇది ఉచితం కాదు… మీ ఫీజు నేనే కడుతా : అభ్యర్థులకు భరోసా రాబోయే ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షల వరకు మీకు ఉద్యోగం తప్ప మరేదీ కనిపించకూడదు. మహాభారతంలో అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపెట్టినట్లు… మీ లక్ష్యం అంత స్పష్టంగా ఉండాలి” అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అభ్యర్థులకు పిలుపునిచ్చారుఉచితం..అనుకోకండి – పట్టుదలతో చదవండి:దీన్ని ఉచిత కోచింగ్ అని పిలవడం మానేయండి. ఉచితం అనగానే నిర్లక్ష్యం వస్తుంది. పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మీరు కట్టాల్సిన ఫీజును నేనే చెల్లిస్తున్నాను. కాబట్టి సొంత డబ్బులు కట్టి చదువుతున్నామనే తీవ్రమైన పట్టుదలతో శ్రమించి ఉద్యోగం సాధించాలి. ఖరీదైన పుస్తకాలు, పెద్ద కోచింగ్ సెంటర్లు లేకపోయినా మీలోని పట్టుదలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.”

​ఆరు నెలలు సోషల్ మీడియాకు దూరం:ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా తరగతులకు హాజరు కావాలి. రీల్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల కోసం సమయం వృథా చేయకుండా కొన్ని నెలల పాటు ఫోన్లు పక్కన పెట్టండి. ఈ 6 నెలలు కష్టపడితే మీ జీవితం, మీ భవిష్యత్తు  బాగుపడుతుంది, మీ తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకుని తిరుగుతారు. సిల్లీ కారణాలతో డుమ్మా కొడితే శిక్షణ నుంచి తొలగించి వేరే వాళ్లకు అవకాశం ఇస్తాం.

​గ్రౌండ్ శిక్షణ, ఫైనల్ ఎగ్జామ్ దాకా బిఎమ్‌ఆర్ అండ.

“ఇప్పటికే 9 వారాలుగా వీక్లీ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. మాక్ టెస్టుల్లో మార్కులు తగ్గితే నిరాశపడకుండా లోపాలు దిద్దుకోండి. నవంబర్ 29 (ఎస్‌ఐ), డిసెంబర్ 20 (కానిస్టేబుల్) తొలి పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు పీటీల ద్వారా మైదానంలో ఫిజికల్ టెస్ట్ (PT) శిక్షణ ఇప్పిస్తాం. ఆ తర్వాత జరిగే ఫైనల్ పరీక్షకు కూడా పూర్తి ఉచిత కోచింగ్ అందిస్తాం.”

​2018 నాటి అనుభవం – స్ఫూర్తిగా నిలవాలి:

“2018లో పరిగిలో 1,500 మందికి ఉచిత కోచింగ్ ఇస్తే ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారు. యూనిఫాం ధరించడం ఒక గౌరవం, బాధ్యత. రేపు మీరు కొలువు సాధించాక, మీలాగే కష్టపడే మరొక విద్యార్థికి స్ఫూర్తిగా నిలవాలి” అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి, వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు