తాండూరులో గంజాయి కలకలం.. యువతపై మత్తు నీడా .!
తాండూరు అక్టోబర్ 3( తెలంగాణ వార్త ప్రతినిధి) తాండూరు పట్టణంలో గంజాయి వినియోగంపై పోలీసుల నిఘా పెరిగినట్లు సమాచారం. గంజాయి వినియోగిస్తున్నట్లు అనుమానిస్తున్న సుమారు 25 మందిని టౌన్ పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు గోప్యంగా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.యువతకు గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? ఏ రాష్ట్రం నుంచి పట్టణానికి చేరుతోంది? సరఫరా వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.
యువత భవిష్యత్తుకు మత్తు ముప్పు!గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉంది. చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలకు దూరం చేసే వ్యసనాలకు యువత ఆకర్షితులు కావద్దని పలువురు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహితుల వలయం, అలవాట్లపై అప్రమత్తంగా ఉండాలి.గంజాయి సరఫరా చేసే మూలాలను గుర్తించి అరికట్టడంతో పాటు యువతను ఈ వ్యసనం నుంచి కాపాడేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని యువతకు పిలుపునిస్తున్నారు……
