తాండూరు, అక్టోబర్ 27 ( తెలంగాణ వార్త ప్రతినిధి):-పారిశుద్ధ్యమే లక్ష్యంగా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాండూరు పట్టణంలో చేపట్టిన స్వచ్ఛ తాండూరు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి 19వ వార్డు నుండి 24వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఉదయం నుంచే వార్డులోని గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ప్రజలతో మమేకమై వారి అవసరాలపై ఆరా తీశారు.వార్డులో నెలకొన్న పారిశుద్ధ్యం, స్థానిక మౌలిక వసతులు, ఇతర సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే.. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేశారు. వార్డులోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టారు అధికారులకు తెలిపారు ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ద్వారా పాలనను మరింత చేరువ చేయవచ్చనే లక్ష్యంతో ఈ పర్యటన సాగింది. స్వచ్ఛతతో పాటు వార్డుల అభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంపై కార్యక్రమంలో దృష్టి సారించారు.ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వారికి అవసరమైన వనరులను గుర్తించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు తాండూరు ఎమ్మెల్యే భుజాని 19వ వార్డు నుంచి 24వ వార్డు వరకు విస్తృతంగా పర్యటించారు. ఉదయం నుంచే ఆయా వార్డుల్లోని గల్లీగల్లీ తిరుగుతూ ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ప్రజలతో వినయంగా మమేకమై వారి అవసరాలపై ఆరా తీశారు.వార్డుల్లో నెలకొన్న పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, ఇతర మౌలిక వసతుల సమస్యలను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ద్వారా పాలనను మరింత చేరువ చేయవచ్చనే లక్ష్యంతో ఈ పర్యటన సాగింది. ప్రతి వార్డులోని సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, వాడు కౌన్సిలర్ తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగు,మున్సిపల్ కమిషనర్రాజేష్,, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, వివిధ అధికారులు పాల్గొన్నారు
గల్లీ గల్లీకి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజల వద్దకే పాలన..!
