తాండూరు, నవంబర్ 3 తెలంగాణ వార్త ప్రతినిధి:
హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీసీ యువ నాయకుడు కుమ్మరి ఆకాష్‌ను అభ్యర్థిగా తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధిష్ఠానం ప్రకటించింది. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడంతో పాటు బీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ సందర్భంగా తాండూరు పట్టణంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ తాండూరు ఇన్చార్జి బుస్సా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు కుమ్మరి ఆకాష్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. విద్యావంతులైన పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించేందుకు యువ నాయకత్వం ముందుకు రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు.కుమ్మరి ఆకాష్ అభ్యర్థిత్వానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాలు, యువత సంపూర్ణ మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ వీరమణి, కోళ్ల శ్రీనివాస్, కళావతి, యాదయ్య, లావణ్య, ఇందిర, వినోద, స్వప్నతో పాటు తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
