టి యు డబ్ల్యూ జే జిల్లా మహాసభకు ఎమ్మెల్యే బీఎంఆర్‌కు ఆహ్వానం 

టి యు డబ్ల్యూ జే జిల్లా మహాసభకు ఎమ్మెల్యే బీఎంఆర్‌కు ఆహ్వానం 

తాండూర్ నవంబర్ 02తెలంగాణ వార్త ప్రతినిధి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టి యు డబ్ల్యూ ) వికారాబాద్ జిల్లా తృతీయ మహాసభకు హాజరుకావాలని కోరుతూ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ను జర్నలిస్టులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ నెల 10వ తేదీ మంగళవారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న జిల్లా మహాసభకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యేకు వివరించి, కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసభకు ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించారు.