ఓట్ చోరీకి వ్యతిరేకంగా ‘చలో ఢిల్లీ’
నవంబర్ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు
తాండూరు అక్టోబర్ 31( తెలంగాణ వార్త ప్రతినిధి)ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శనివారం ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు.ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తదితర అంశాలపై నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు ఈ పర్యటనలో ఉన్నారు
