తాండూర్ ( ఆగస్ట్ 17th 2026 ): బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణకు, కార్యకర్తల పట్ల నాయకత్వానికి ఉన్న నిబద్ధతకు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి తాండూర్ పర్యటన నిదర్శనమని బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు అన్నారు.
తాండూర్ నియోజకవర్గానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలకడం పట్ల ఆయన స్పందిస్తూ… ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ, కార్యకర్తలతో ఉన్న అనుబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
పార్టీ కార్యక్రమంలో భాగంగానే కాకుండా, తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలను కలుసుకోవడం, తాండూర్ ప్రజల అభిమానాన్ని గౌరవించడం కోసం రోహిత్ రెడ్డి గారు తాండూర్‌కు వచ్చారని తెలిపారు.
రోహిత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా కనిపించిన జనసందోహం, కార్యకర్తల ఉత్సాహం, ప్రజల అభిమానం చూసి కాంగ్రెస్ నాయకులు అసహనంతో చౌకబారు విమర్శలు చేస్తున్నారని దత్తాత్రేయ రావు విమర్శించారు.
ప్రజల మధ్య బలంగా ఉన్న నాయకుడిని చూసి భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. విమర్శలకు సమాధానం చెప్పేది మాటలు కాదని, ప్రజల అభిమానం, కార్యకర్తల అండ, భవిష్యత్ ప్రజా తీర్పు అని అన్నారు.
తాండూర్ ప్రజల గుండెల్లో రోహిత్ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేక స్థానం ఏమిటో ఆయన పర్యటన సందర్భంగా వచ్చిన జనస్పందనే స్పష్టం చేసిందని దత్తాత్రేయ రావు తెలిపారు.
