ప్రజాసేవే లక్ష్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు..!

తాండూరు (5th ఆగస్ట్ 2026) :తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారి జన్మదినాన్ని పురస్కరించుకుని యువ నాయకులు షేక్ మౌజం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా సుమారు 200 మంది విద్యార్థులకు దుప్పట్లు అందజేసి, వారికి అవసరమైన సమయంలో అండగా నిలిచారు. సేవా కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి నీరజ బాల్ రెడ్డి  మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

అనంతరం విద్యార్థులు వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వీడియో కాల్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే గారికి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

విద్యార్థులకు సేవా కార్యక్రమం నిర్వహించిన యువ నాయకులు షేక్ మౌజం విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి  జన్మదిన వేడుకలను పురస్కరించుకుని చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.