తాండూరు ( 10 జులై 2026) : తాండూర్ పట్టణంలోని పాఠశాలల పరిసర ప్రాంతాల్లో విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్వీ నాయకులు తాండూర్ డీఎస్పీకి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాలల వద్ద బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులు పాఠశాలలకు వచ్చే సమయం, వెళ్లే సమయంలో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని కోరారు.
ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 3:55 గంటల నుంచి 5:00 గంటల వరకు పాఠశాలల పరిసర ప్రాంతాల్లో హెవీ వెహికల్స్ రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు.
అలాగే మైనర్లు వాహనాలు నడపకుండా చర్యలు తీసుకోవాలని, ఆటోల్లో అధిక శబ్దంతో వినియోగిస్తున్న సౌండ్ సిస్టమ్స్‌ను తనిఖీ చేయాలని కోరారు.
ఈ సందర్భంగా డీఎస్పీ గారు సానుకూలంగా స్పందిస్తూ విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం, పాన్ షాపులు తదితర ప్రాంతాల్లో గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, యువ నాయకులు వినోద్ కుమార్, షాహెబ్ అడ్డు, భాను, గణేష్, రాజేష్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
