వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ SIR కార్యక్రమం మరియు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ నీ బీఆర్ఎస్వి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న “అనుచిత ప్రవర్తన” మరియు పట్టణంలో ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఉత్పన్నమైన వివాదాలు గురించి ఆయనతో సవివరంగా చర్చించారు. ప్రజల హక్కులు, పారదర్శకత అంశాలపై పార్టీ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ సానుకూలంగా స్పందిస్తూ, ప్రజలకు న్యాయం జరిగేలా సమస్యలను సంబంధిత స్థాయిలో తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్వి కొర్ర సందీప్ నాయక్, వినోద్ కుమార్, తౌసీఫ్ షకీల్ పాల్గొన్నారు.
