హైదరాబాద్ ( జులై 2 ) : తాండూరు నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ మరియు రూరల్ వాటర్ సప్లై (Intra & Grid) అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇప్పటి వరకు మంజూరైన అన్ని అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బీటీ రోడ్లు, బ్రిడ్జిలు, సీసీ రోడ్లు, డ్రైన్లు, గ్రామపంచాయతీ భవనాలు, SHG భవనాలు, స్కూల్ ప్రహరీ గోడలు వంటి ప్రజా మౌలిక వసతుల పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఆయన సూచించారు.
అభివృద్ధి పనుల్లో ఎటువంటి జాప్యానికి తావు ఇవ్వకుండా ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు త్వరగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
ప్రజల అవసరాలే ప్రభుత్వానికి ప్రాధాన్యం అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, పనుల అమలులో నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ మరియు రూరల్ వాటర్ సప్లై (Intra & Grid) అధికారులు పాల్గొన్నారు.
