ఖబడ్దార్ అనిల్… నోరు అదుపులో పెట్టుకో! మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరు: పట్లోళ్ల సందీప్ రెడ్డి..!

తాండూరు: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ర్యాలీ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు అనిల్ బాండ్ తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకుడు శ్రీ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గార్లపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను కాంగ్రెస్ యువనాయకులు పట్లోళ్ల సందీప్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉంటుంది. ప్రజా జీవితంలో ఉన్న నాయకులపై వ్యక్తిగతంగా అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదు. మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు.

“మీ నాయకుడు ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్లలేదు. ఆయనపై వచ్చిన ఆరోపణల కారణంగానే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొన్నారు. తాండూరు ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. వాస్తవాలు ప్రజలకు తెలుసు” అని అన్నారు.

తాండూరు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రజలు కోరుకుంటున్నారని, కానీ కొంతమంది కావాలనే వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

“తాండూరు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు కానీ రెచ్చగొట్టే రాజకీయాలను కాదు. గతంలో ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. రౌడీయిజం, బెదిరింపు రాజకీయాలకు తాండూరు ప్రజలు ఇప్పటికే సమాధానం చెప్పారు” అని సందీప్ రెడ్డి పేర్కొన్నారు.

తమ నాయకులపై చేసిన వ్యాఖ్యలకు అనిల్ బాండ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు.

“తాండూరులో అభివృద్ధి రాజకీయాలే కొనసాగాలి… అరాచక రాజకీయాలకు ప్రజలే ముగింపు పలుకుతారు” అని కాంగ్రెస్ యువనాయకులు స్పష్టం చేశారు.