ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క..!

హైదరాబాద్ (ఆగస్ట్ 28th 2026) : రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు  దనసరి అనసూయ సీతక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ ప్రాముఖ్యతను మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి  సీతక్కకి కృతజ్ఞతలు తెలియజేశారు.