తాండూర్ ( సెప్టెంబర్ 5th 2026) : ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థులను రాజకీయ ర్యాలీలకు వినియోగించడం సిగ్గుచేటని తాండూర్ నియోజకవర్గ NSUI అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సెప్టెంబర్ 5న విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిన సమయంలో వారిని రాజకీయ కార్యక్రమాలకు తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతోనే విద్యార్థులను రాజకీయ ర్యాలీలకు తీసుకువచ్చి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు బలి చేయకుండా, వారి చదువులు మరియు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, యువత సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ప్రేమ్ కుమార్ తెలిపారు. ఉద్యోగాల భర్తీతో పాటు హాస్టల్ మెస్, కాస్మెటిక్ చార్జీల పెంపు, బ్రేక్ఫాస్ట్, యూనిఫాంలు, షూల పంపిణీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.
తాండూర్లో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ITI సమస్యను పరిష్కరించి, ATCగా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
“విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు ఉండాలి.. రాజకీయ జెండాలు కాదు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థులను రాజకీయ ర్యాలీలకు దూరంగా ఉంచాలి” అని ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు.
