కోటబాస్‌పల్లిలో ఘనంగా మాజీ మంత్రి ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు

ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం

కోటబాస్‌పల్లిలో ఘనంగా మాజీ మంత్రి ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు

 ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్  అధ్యక్షులు సిటీ కేబుల్ ఎండి గొట్టిగ నరసింహారెడ్డి  ( బాబన్న)

తాండూర్ అక్టోబర్ 4 తెలంగాణ వార్త ప్రతినిధి

తాండూరు: తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన మాజీ విద్యాశాఖ మంత్రి, మాజీ హోంమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, సిటీ కేబుల్ ఎండీ గొట్టిక నరసింహారెడ్డి (బాబన్న) అన్నారు.

తాండూరు మండలం కోటబాస్‌పల్లి గ్రామంలో ఇంద్రారెడ్డి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి విగ్రహానికి నరసింహారెడ్డి (బాబన్న) పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సేవ, విద్యాభివృద్ధి, తెలంగాణ ప్రాంత అభ్యున్నతి కోసం ఇంద్రారెడ్డి చేసిన కృషి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. సమాజం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, ప్రజల సమస్యలపై ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

ఇంద్రారెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని నరసింహారెడ్డి అన్నారు. విద్యా రంగానికి, తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో టీచర్ నాగప్ప, రాజశేఖర్ రెడ్డి, డైరెక్టర్లు వెంకటేష్, నర్సింలు,పలువురు ఇంద్రారెడ్డి అభిమానులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొని నివాళులర్పించారు.