స్వచ్ఛ తాండూరు స్పెషల్ డ్రైవ్’లో ఆరు వార్డుల్లో విస్తృత పర్యటన

పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ

స్వచ్ఛ తాండూరు స్పెషల్ డ్రైవ్’లో ఆరు వార్డుల్లో విస్తృత పర్యటన

‘-సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై అరా.

తాండూరు అక్టోబర్ 05-: తెలంగాణ వార్త ప్రతినిధి

తాండూరు: పట్టణ అభివృద్ధి, పారిశుధ్య సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) ప్రజల వద్దకు వెళ్లనున్నారు.పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ తాండూరు స్పెషల్ డ్రైవ్’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బీఎంఆర్ 26, 27, 33, 34, 35, 36వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో వీధుల్లో తిరుగుతూ స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల పరిస్థితిని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించనున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయా? పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతోందా? అనే అంశాలపై స్థానికులను అడిగి తెలుసుకోనున్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు సూచనలు చేయనున్నారు. దీర్ఘకాలిక సమస్యలకు అవసరమైన నిధులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించడం, వార్డుల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం ఈ స్పెషల్ డ్రైవ్ ప్రధాన ఉద్దేశంగా కొనసాగనుంది. ఎమ్మెల్యే నేరుగా తమ వార్డుల్లో పర్యటించనుండటంతో స్థానిక ప్రజలు తమ సమస్యలను బీఎంఆర్ దృష్టికి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.