ఉపాధి కూలీలకు ఆసరాగా ‘వీబీ-జీ రామ్ జీ

–ఉపాధి కూలీలకు ఆసరాగా ‘వీబీ-జీ రామ్ జీ

– ఎల్ లి నో ప్రభావంతో పనులు లేక ఇబ్బందులు.. పొలాల్లోనే ఉపాధి పనులు కల్పిస్తున్నాం

వ్యవసాయ కుంటలు, అభివృద్ధి పనుల పరిశీలన

తాండూరు మండలంలో విస్తృతంగా జడ్పీ సీఈఓ ఎం సుధీర్ పర్యటన..

తాండూరు, అక్టోబర్ 07 (తెలంగాణ వార్తా ప్రతినిధి):-

వికారాబాద్ జిల్లా పరిషత్ సీఈఓ (ఎం. సుధీర్  బుధవారం తాండూరు మండల పరిధిలోని చెంగేష్‌పూర్, గౌతాపూర్, ఎల్మకన్య గ్రామాల విస్తృతంగా పర్యటించిన వికారాబాద్ జిల్లా జడ్పీ సీఈఓ సుదీర్  

వ్యవసాయ కుంటల స్థితిగతులను మరియు వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సీఈఓ ప్రత్యక్షంగా పరిశీలించారు.ఉపాధి హామీ కూలీలతో నేరుగా ముఖాముఖి…ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన “వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికామిషన్(గ్రామీణ్)”అమలవుతున్న తీరును పర్యవేక్షించారు. పనుల వద్ద ఉన్న కూలీలతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వేతనాలు, పనుల్లో ఎదురవుతున్న సౌకర్యాలు మరియు ఇతర సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పొలాల్లోనే ఉపాధి పనులు:అనంతరం జడ్పీ సీఈఓ సుధీర్ మాట్లాడుతూ — ఈ సంవత్సరం ‘ఎల్ నినో ప్రభావం కారణంగా వ్యవసాయ పనులు తగ్గిపోయి కూలీలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసరాగా నిలిచేందుకు వారి వారి స్వంత పొలాల్లోనే ఉపాధి హామీ పనులను కల్పిస్తూ ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు.మండలంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా, అత్యంత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో మండల అధికారులు, విశ్వ ప్రసాద్ , ఉపాధి హామీ సిబ్బంది నరోత్తం రెడ్డి నరోత్తం రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శులు పార్వతమ్మ వీరన్న,ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ఉపాధి కూలీలకు నీళ్లు కరువా…?

అధికారులపై సీఈవో సుధీర్‌ ఆగ్రహం!

ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిందే!

నీరు, గ్లూకోజ్‌ తదితర సౌకర్యాలు లేకపోవడంపై అధికారులపై సీఈవో సుధీర్‌ ఆగ్రహం

గౌతపూర్: ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలకు తాగునీరు, గ్లూకోజ్‌ పౌడర్‌ తదితర కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై సీఈవో సుధీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఆయన, కూలీలకు అవసరమైన సౌకర్యాలపై అధికారులను ఆరా తీశారు.కూలీలు ఎండలో పనిచేస్తున్న సమయంలో తాగునీరు, ఓఆర్‌ఎస్‌/గ్లూకోజ్‌ వంటి ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంపై పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కూలీల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, పనిప్రదేశాల్లో అవసరమైన సౌకర్యాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఉపాధి హామీ పనులు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయా లేదా అనే విషయాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఈవో సుధీర్‌ సూచించారు.