గౌతాపూర్ బడిలో గుభాళించిన బతుకమ్మ సంబరాలు!

లీలావతి హెచ్‌ఎం ఆధ్వర్యంలో విద్యార్థినుల సందడి.. రంగురంగుల పూలతో వేడుకలు….

తాండూరు, అక్టోబర్ 9 ( తెలంగాణ వార్త ప్రతినిధి):

తాండూరు మండలం గౌతాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు లీలావతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను కోలాహలంగా జరుపుకున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను చాటుతూ విద్యార్థినులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అలంకరించారు. బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. పాఠశాల ప్రాంగణం బతుకమ్మ పాటలు, విద్యార్థినుల ఉత్సాహంతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు పండుగల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఇలాంటి వేడుకల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాలలో బతుకమ్మ సంబరాలు సందడిగా సాగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జె.సుజనా మహేష్, ఉపాధ్యాయురాలు మాధురిదేవి. రమాదేవి, కల్పన. వజ్రమాల, విద్యార్థుల తల్లిదండ్రులు