పప్పుధాన్యాల సాగుపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన

తాండూరులో కంది పంటల పరిశీలన.. 

మహిళా రైతులకు ప్రాసెసింగ్‌పై అవగాహన….

తాండూరు, అక్టోబర్ 9( తెలంగాణ వార్త ప్రతినిధి)

ఆత్మనిర్భరత కోసం పప్పుధాన్యాల మిషన్ ( ఎం ఏ ఎన్ పి ) 2026–27 కార్యక్రమంలో భాగంగా కేంద్ర బృందం శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో పర్యటించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పల్స్ డెవలప్‌మెంట్ అర్జున్ కుమార్ శివ హరి తాండూరు లో కంది పంట సాగు చేసిన రైతుల పొలాలను సందర్శించి పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం తాండూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో మహిళా రైతు సంఘాలకు దాల్ మిల్లు పై ఉత్పత్తిదారుల కంపెనీ (FPO) సభ్యులతో సమావేశం నిర్వహించారు ఎం ఏ ఎన్ పి పథకం కింద పప్పుధాన్యాల మిల్లు కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా రైతులతో చర్చించి, పప్పుధాన్యాలను ప్రాసెసింగ్ చేసి విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలను వివరించారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి కె. కవిత, తాండూరు సహాయ వ్యవసాయ సంచాలకులు కె. అరుణ, డిపిఎం శేఖర్ ఏపీఎం బాలయ్య వ్యవసాయ విస్తరణ అధికారులు, మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.