పేదింటి కళ్యాణానికి కాంగ్రెస్ కొండంత అండ!

తాండూరు, అక్టోబర్ 28 (తెలంగాణ వార్త ప్రతినిధి):పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి ఇళ్లలో వెలుగులు నింపడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం పనిచేస్తోందని తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం యాలాల మండల రైతు వేదికలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 24 మంది లబ్ధిదారులకు రూ. 24,02,784 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలనలో ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు నేరుగా అందుతున్నాయి. సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నాంమహిళా సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఆడబిడ్డల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించాం.”అర్హులైన ప్రతీ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ నిరుపేద కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యాన్ని అందిస్తున్న ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడతాం. అర్హులైన ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలిఅన్నారుఈ కార్యక్రమంలోయాలాల సొసైటీ ఛైర్మన్ చెన్నారం అనిల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నర్సిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్, మాజీ ఛైర్మన్ సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు, తిమ్మాయిపల్లి భీమయ్య, శ్రీధర్, యువ నాయకులు చంద్రశేఖర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పార్టీ ముఖ్య నాయకులు, లబ్ధిదారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.