తాండూరు, అక్టోబర్ 17 (తెలంగాణ వార్త ప్రతినిధి)
తాండూరు పట్టణంలోని సాయిపూర్లో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవి నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారి ఆశీస్సులు తాండూరు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. భక్తులు కోరిన కోరికలను తీర్చే అమ్మవారు ప్రతి ఇంటా అష్టైశ్వర్యాలు, సంతోషాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. మహిళలు సంప్రదాయ ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి , కాంగ్రెస్ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
