ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబానికి సొంతింటి కల సాకారo

ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబానికి సొంతింటి కల సహకారం

బాయిమీది తండాలో నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు, అక్టోబర్ 17 (తెలంగాణ వార్త ప్రతినిధి):పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దేముల్ మండలం బాయిమీది తండాలో రాథోడ్ హీరిబాయి నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంట్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సొంత ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఒక కల అని, ఆ కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వారికి భద్రత, ఆత్మగౌరవం కల్పించడంలో ఇందిరమ్మ ఇళ్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

నూతన గృహప్రవేశం చేసుకున్న రాథోడ్ హీరిబాయి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.