తిరుమల శ్రీవారి దర్శనం పొందిన 16వ వార్డు కౌన్సిలర్ నారా శ్రీలత శ్రీకాంత్..!

తిరుమల ( సెప్టెంబర్ 7th 2026 ) : పవిత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని 16వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి నారా శ్రీలత శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు సోమవారం దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం నిండాలని వారు మనస్ఫూర్తిగా ప్రార్థించారు.

వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారికి, వారి బృందానికి నారా శ్రీలత శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.