కొత్లాపూర్‌లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

–కొత్లాపూర్‌లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

దసరా పండుగ నేపథ్యంలో గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు

–గ్రామ సర్పంచ్ చంద్రకళ వెంకటరామ్ రెడ్డి 

తాండూర్ అక్టోబర్ 12( తెలంగాణ వార్త ప్రతినిధి)  దసరా పండుగను పురస్కరించుకొని గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని వీధులను శుభ్రపరచడంతో పాటు మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అలాగే గ్రామ వీధి దీపాల నిర్వహణపై కూడా దృష్టి సారిస్తున్నారు.గ్రామ సర్పంచ్ చంద్రకళ వెంకట్రాంరెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. పండుగ సమయంలో గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు మురుగు కాల్వల వల్ల దుర్వాసన, దోమల సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ, దసరా పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు సక్రమంగా జరిగేలా సర్పంచ్ చంద్రకళ వెంకట్రాంరెడ్డి పర్యవేక్షణలో చర్యలు కొనసాగుతున్నాయి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు కూడా సహకరించాలని సూచిస్తున్నారు.