ఓటు హక్కు పరిరక్షణ మనందరి బాధ్యత -ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

తాండూరు ( 23 జులై 2026) : ఓటు హక్కు పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) కీలక పాత్ర పోషించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) అన్నారు.

తాండూరు క్యాంప్ కార్యాలయంలో తాండూరు పట్టణ BLAలతో నిర్వహించిన SIR (Special Intensive Revision) సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “SIR ప్రక్రియలో BLAలు ఇప్పటికే కీలకంగా పనిచేస్తున్నారు. మిగిలిన రోజులలో కూడా మరింత అప్రమత్తంగా పనిచేసి అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలి” అని సూచించారు.

భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు ఓటు హక్కు అని, ఎలాంటి కారణాలతోనూ అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి BLA బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

ఇంటింటికీ వెళ్లి ప్రజలకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించాలని, అవసరమైన దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సక్రమంగా జరిగేలా సహకరించాలని కోరారు.

ప్రతి బూత్, ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఓటు హక్కును కాపాడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఖచ్చితమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో కీలకమని, ఈ బాధ్యతను ప్రతి కార్యకర్త నిబద్ధతతో నిర్వర్తించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

ఈ సమావేశంలో TPCC SIR పర్యవేక్షకులు కోటం వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ SIR కన్వీనర్ పురుషోత్తం రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, BLAలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.