గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం!

గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం!
– ఘనంగా ప్రపంచ హృదయ దినోత్సవం

*ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్*

*తాండూర్ సెప్టెంబర్ 29 తెలంగాణ వార్త ప్రతినిధి
గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, హృదయ సంబంధ వ్యాధుల (కార్డియోవాస్క్యులర్ డిసీజెస్‌) నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం లక్ష్యంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తాండూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. IMA అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు
ఈ సందర్భంగా వైద్యులు జయప్రసాద్ మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా ఉన్నాయని తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం, పొగతాగడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి అంశాలు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని వివరించారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం, ఉప్పు–చక్కెర–కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించడం, పండ్లు–కూరగాయలు–పౌష్టికాహారం తీసుకోవడం, పొగతాగడం మరియు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం, శరీర బరువును నియంత్రించుకోవడం అవసరమని సూచించారు.అలాగే రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ స్థాయులను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని, ఛాతీలో నొప్పి లేదా బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమటలు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.“గుండెను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే భవిష్యత్తులో హృదయ సంబంధ వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు” అని వైద్యులు పేర్కొన్నారు.ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రజలు తమ గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని, కుటుంబ సభ్యులు మరియు సమాజంలోనూ ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం కల్పించాలని వైద్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్ ట్రెజర్ జైదీప్ రెడ్డి వైద్యులు రాంబాబు, శివ మోహన్ రెడ్డి,డాక్టర్ వివేక్
డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సంతోష్. డా. ఆనంద్ కుమార్, డాక్టర్ సమేయుల్లా
డాక్టర్ శిల్పిక,డాక్టర్ అను సిరికర్, డా. శుభ శ్రీ,డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ అభిషేక్,డా. ఓంకార్డా. గౌతమ్ కృష్ణా రెడ్డి, డా. సాయి రాఘవ రెడ్డి,(ఖాళీ) రెడ్డి,పాల్గొన్నారు