అంగన్వాడీ టీచర్లు, ఆయాల 51 పోస్టులు ఖాళీ!
నోటిఫికేషన్ విడుదల.. అర్హులైన మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
సీడీపీఓ శ్రీలక్ష్మి వెల్లడి
తాండూర్,అక్టోబర్ 9 (తెలంగాణ వార్త ప్రతినిధి)
అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సీడీపీఓ శ్రీలక్ష్మి వెల్లడించారు. మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 23 అంగన్వాడీ టీచర్ల పోస్టులు, 28 ఆయా పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు.అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీలోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత ప్రాజెక్టు అధికారులను సంప్రదించాలని సీడీపీఓ శ్రీలక్ష్మి సూచించారు. అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.
