అమ్మవారి సన్నిధిలో బీఎంఆర్‌ ప్రత్యేక పూజలు

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. తాండూరు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి
శ్రీ కాళికాదేవి, శ్రీ నగరేశ్వర ఆలయాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పూజలు

తాండూరు, అక్టోబర్ 14 (ఉదయం ప్రతినిధి): భక్తి భావం.. ప్రజల సంక్షేమంపై ఆకాంక్ష.. నియోజకవర్గ అభివృద్ధిపై నిబద్ధత.. వెరసి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయం, శ్రీ నగరేశ్వర దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రత్యేక పూజల్లో పాల్గొని దైవదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, రైతులు, కార్మికులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించారు.

ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా..

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాండూరు నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని, ప్రజల జీవితాల్లో సంతోషం నిండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పండుగలు కేవలం ఆచారాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల మధ్య ప్రేమాభిమానాలను, ఐక్యతను పెంపొందించాలని ఆకాంక్షించారు.

ప్రజల సంక్షేమం, నియోజకవర్గ ప్రగతి సమాంతరంగా సాగినప్పుడే అభివృద్ధికి నిజమైన అర్థం చేకూరుతుందన్న ఆశయంతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే బీఎంఆర్.. శరన్నవరాత్రుల పవిత్ర వేళ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించడం విశేషం.