మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బీఎంఆర్
యాలాల్, తాండూరు ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు పరామర్శ..
తాండూరు, అక్టోబర్ 15 (తెలంగాణ వార్త ప్రతినిధి):
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. యాలాల్ మండల కేంద్రంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్, బెన్నూర్ గ్రామంలో అఖిల్ గౌడ్, తాండూరు పట్టణంలో డాక్యుమెంట్ రైటర్ ప్రభులింగం, లారీ ట్రాన్స్పోర్ట్ వ్యాపారి నర్సింహ రెడ్డి తల్లి చిట్టెపు పద్మమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి నివాసాలకు వెళ్లారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు.
