రైతుబిడ్డ చొరవ.. జనగాం కాల్వకు సాగునీటి పారవశ్యం!

​రైతుబిడ్డ చొరవ.. జనగాం కాల్వకు సాగునీటి పారవశ్యం!

​కోటిపల్లి ప్రాజెక్ట్ జలాలతో చిగురించిన అన్నదాతల ఆశలు

​పారిన సాగునీరు.. తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి శ్రమకు దక్కిన ఫలితం

​ప్రాజెక్ట్ పునరుద్ధరణకు రూ. 89 కోట్ల భారీ నిధుల మంజూరు

​మనోహర్ అన్నకు’ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ అరుణ, జనగాం రైతాంగం

​ తాండూరు అక్టోబర్ 23 తెలంగాణ వార్త ప్రతినిధి

దశాబ్దాలుగా ఎండిపోయిన చేలకు, అన్నదాతల ఆశలకు మళ్లీ ప్రాణవాయువు లభించింది. తాండూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, రైతుల పక్షపాతి ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవతో పెద్దముల్ మండలం జనగాం గ్రామ కెనాల్ కాల్వలోకి కోటిపల్లి ప్రాజెక్టు సాగునీరు విడుదలవుతోంది. కాల్వల ద్వారా పొలాలకు పరుగులు తీస్తున్న సాగునీటిని చూసి రైతాంగం సంతోషంతో ఉప్పొంగిపోతోంది. ఎండిపోతున్న పంటలకు నీరందడంతో అన్నదాతల కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలాయి.

​నిధుల మహాపూర్వకం – రూ. 89 కోట్లతో చారిత్రాత్మక విజయం

​కోటిపల్లి ప్రాజెక్టును ఆధునీకరించి, నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి నీరందించాలనే పట్టుదలతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాత్రింబవళ్లు శ్రమించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ప్రాజెక్టు అభివృద్ధి పనులకు గాను ఏకంగా రూ. 89 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించిన ఘనత ఆయనకే దక్కుతుందని స్థానిక ప్రజలు నినదిస్తున్నారు. తాండూరు ప్రాంత నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ నిధులు కీలక పాత్ర పోషించనున్నాయి.

​నిజమైన ‘రైతుబిడ్డ’ మనోహర్ అన్న!

​తాను కేవలం నాయకుడిని మాత్రమే కాదని, రైతుల కష్టసుఖాలు తెలిసిన ‘రైతుబిడ్డనని’ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. పొలాల్లో పారుతున్న నీటిని చూసి సర్పంచ్ అరుణ మరియు గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు.

​”మా కష్టాలను స్వయంగా తెలుసుకొని, చెప్పిన మాట ప్రకారం కాల్వలకు నీటిని విడుదల చేయించిన మనోహర్ అన్నకు జనగాం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. రూ. 89 కోట్లు మంజూరు చేయించి కోటిపల్లి ప్రాజెక్టుకు జీవం పోసిన ఆయన కృషి ఎప్పటికీ మరచిపోలేము.

అరుణ (గ్రామ సర్పంచ్) జనగాం రైతాంగం

​కోటిపల్లి జలాల రాకతో జనగాం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. రైతులు పరస్పరం తీపి తినిపించుకుంటూ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ ప్రాజెక్ట్ జలాలకు నీరాజనాలు అర్పించారు.