భక్తిశ్రద్ధలతో శ్రీ ప్రసన్న అభయ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకం మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి

తాండూరు, అక్టోబర్ 24 ( తెలంగాణ వార్త ప్రతినిధి):

తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో కొలువుదీరిన శ్రీ ప్రసన్న అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శనివారం ప్రత్యేక అభిషేక కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేదమంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాల మధ్య స్వామివారికి అభిషేకం నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంజనేయ స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, తాండూరు ప్రాంతం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతోపాటు మన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కార్యక్రమంలో భక్తులు వాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు