తాండూర్, జూన్ 4 : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (SIR – Special Intensive Revision) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు తాండూర్ పట్టణంలోని తులసీ గార్డెన్స్‌తులసీ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ BLAల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
టీపీసీసీ ఆదేశాల మేరకు, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచనలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూర్ నియోజకవర్గ SIR కన్వీనర్ కరణం పురుషోత్తం రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర SIR కన్వీనర్, పరిగి ఎమ్మెల్యే డా.టి.రామ్మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధారాసింగ్‌తో పాటు టీపీసీసీ తరఫున పలువురు శిక్షకులు హాజరై SIR ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.
తాండూర్ నియోజకవర్గ పరిధిలోని 269 పోలింగ్ బూత్‌లకు చెందిన పోలింగ్ ఏజెంట్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మండల, గ్రామ, మున్సిపల్ వార్డు అధ్యక్షులు, ఆత్మ కమిటీ, మార్కెట్ కమిటీ, PACS చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.
శిక్షణ కార్యక్రమంలో SIR విధివిధానాలు, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ, BLAల బాధ్యతలు, గ్రామ స్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించి పూర్తి సమాచారం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సన్నాహక సమావేశంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
