-రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా చిగురింత పారిజాత నరసింహారెడ్డి
-నూతన అధ్యక్షురాలికి ఘన సన్మానం.. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
తాండూరు అక్టోబర్ 3( తెలంగాణ వార్త ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా చిగురింత పారిజాత నరసింహారెడ్డి నియమితులైన సందర్భంగా ఆమెను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సహకార రంగం మరింత బలోపేతం కావాలని, రైతులు మరియు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో ఆమె విజయవంతంగా కొనసాగాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అభినందించారుఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని చిగురింత పారిజాత నరసింహారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
