నీట్ పరీక్ష నిర్వహణలో ‘కేంద్ర’ పరాజయం – జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారాసింగ్ నాయక్

తాండూరు May 13 (తెలంగాణ వార్త ) :  దేశవ్యాప్తంగ సుమారు 23 లక్షల మంది విద్యార్థుల కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ (DCC) అధ్యక్షుడు ధారాసింగ్ నాయక్ తీవ్రంగా విమర్శించారు.

 

పరీక్షలనీట్  నిర్వహణలో పదేపదే తప్పులు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిద్రావస్థలో కొనసాగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతుంటే, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని పేర్కొన్నారు.

పరీక్షల వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ఈ పరిస్థితులకు బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఘటనలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.