తాండూరు 13th May ( తెలంగాణ వార్త) : ఈ రోజు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కో-ఆప్షన్ ఎన్నికల్లో నాలుగు కో-ఆప్షన్ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలిపించుకుందని తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మరియు ఇతర కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం పార్టీ ఐక్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులుగా 1) మేన్గారి సుభాష్ (15వ వార్డు) 2) మహమ్మద్ రహీం (10వ వార్డు) 3) చినోళ్ల సరిత హరి గౌడ్ (13వ వార్డు) 4) ఆప్రిన్ జవేరియా అన్వర్ అమ్మద్ ఖాన్ (17వ వార్డు).
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు గుర్తింపుగా కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించామని తెలిపారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో సమయానుకూలంగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
