తాండూర్ ఏటీసీ సెంటర్‌లో అడ్మిషన్లు మే 25 నుంచి ప్రారంభం.!

తాండూర్ ( మే 19th 2026 ): యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో తాండూర్ ఏటీసీ సెంటర్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 25-05-2026 నుండి 08-06-2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

వివిధ ట్రేడ్లలో శిక్షణ అందించబడనున్న ఈ కోర్సులకు అర్హత గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, కోర్సుల జాబితా మరియు దరఖాస్తు విధానం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి: https://iti.telangana.gov.in  .