పెద్దేముల్ మండల కేంద్రంలో ఘనంగా రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు..!

పెద్దేముల్ మండలం, మే 21: భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి. మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.

గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి. మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, అతి చిన్న వయసులోనే దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ భారత దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా దేశంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాలకు పునాది వేసి భారతదేశాన్ని ఆధునిక దిశగా నడిపించిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.