( తెలంగాణ వార్త ) మే 24 : బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సురేందర్ గారిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సురేందర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.
ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న సురేందర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అండగా ఉంటారని తెలిపారు. అనంతరం ఆయన చికిత్స కోసం ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు..
