తాండూర్ మే 24 : గ్రామీణ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సమర్థవంతంగా చేరాలనే ఉద్దేశంతో మంబాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తూకం విధానం, రైతులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఎమ్మెల్యే, ధాన్యం విక్రయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజకు సరైన మద్దతు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

అనంతరం ఎమ్మెల్యే అధికారులకు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో తాగునీరు, నీడ, పారిశుద్ధ్య సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, కొనుగోలు కేంద్ర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
