తాండూర్ , మే 24 : రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలుపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తడిసిన ధాన్యం కొనుగోలు, మిల్లర్ల సమన్వయం, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు రైతులు మరియు మిల్లర్లతో సమన్వయం చేసుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది వరి ధాన్యం కొనుగోలు ద్వారా రైతులకు సుమారు రూ.45 వేల కోట్లు అందించామని మంత్రి వెల్లడించారు. రైతుల పక్షాన ప్రజా ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
