యాలాల్ (తాండూరు నియోజకవర్గం): తాండూరు నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతగా సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. యాలాల్ మండలం జుంటుపల్లి ప్రాజెక్ట్ ఎడమ, కుడి కాల్వల ఆధునీకరణ పనులకు రూ.5.71 కోట్ల నిధులతో ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోట్పల్లి ప్రాజెక్ట్ ను దాదాపు రూ.100 కోట్లతో ప్రారంభించామని, ప్రస్తుతం ఆ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జుంటుపల్లి ప్రాజెక్ట్ కాల్వల ఆధునీకరణతో సాగునీటి వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, నీటి వృథా తగ్గి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని వివరించారు. రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే తన లక్ష్యమని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.
గత పాలకులు జుంటుపల్లి ప్రాజెక్ట్ కాల్వల పునరుద్ధరణపై ధ్యాస చూపలేదని, తాండూరు రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చి పనులు పూర్తి చేసి, ఆయకట్టు రైతులందరికీ సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. రైతుల ముఖాల్లో ఆనందం, పొలాల్లో పచ్చదనం నింపడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.గత పాలకులు జుంటుపల్లి ప్రాజెక్ట్ కాల్వల పునరుద్ధరణపై ధ్యాస చూపలేదని, తాండూరు రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పం లేదని ఎమ్మెల్యే విమర్శించారు
జుంటుపల్లి ప్రాజెక్ట్ ఎడమ, కుడి కాల్వల ఆధునీకరణకు శంకుస్థాపన..!
