పరిగి మే 12 (తెలంగాణ వార్త ) వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలో ని సయ్యద్‌పల్లి గ్రామం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, ఆత్మ (ఏటీఎంఏ), ఆర్‌పీఎల్ కార్యక్రమం లో భాగంగా రైతులకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ( టీఆరవికె ) శాస్త్రవేత్త రాజేశ్వరరెడ్డి పాలొగొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను యాంత్రీకరణలో నవీన పద్ధతులు, నానో యూరియా, నానో డీఏపీ ఎలా వినియోగించు కోవాలో వివరించారు. అనంతరం నేల సంరక్షణ, వివిధ పంటలకు అవసరమైన ఎరువుల మోతాదులపై సాంకేతిక పరమైన సూచనలు చేసారు .
మండల వ్యవసాయ అధికారి రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, రాయితీలు, రైతు సంఘాలకు లభించే అవకాశాలపై అవగాహన కల్పించారు. మండల హార్టికల్చర్ అధికారి తమ శాఖలో అమలవుతున్న వివిధ పథకాల గురుంచి రైతులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పరిగి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆత్మ స్టాఫ్ బీటీఎం కే. గణేష్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
