తాండూర్, సెప్టెంబర్ 28 ( తెలంగాణ వార్త ప్రతినిధి) : తాండూరు నియోజకవర్గం లోని తాండూర్ మున్సిపల్ పరిధిలో మంగళవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి ఈ విధంగా పర్యటన ఉదయం 6 గంటలకు తాండూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం తాండూర్ పట్టణంలోని 1 నుంచి 6వ వార్డుల్లో నిర్వహించనున్నారు.
అనంతరం మండల స్థాయి సమీక్ష సమావేశాల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు తాండూర్ మండల స్థాయి సమీక్ష సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు పెద్దేముల్ మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశాల్లో మండలాల పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లు, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు, వార్డు ఇన్‌చార్జీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు..
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే బీఎంఆర్ పర్యటన..!
