తాండూర్, సెప్టెంబర్ 28 ( తెలంగాణ వార్త ప్రతినిధి): తాండూర్ పట్టణంలోని బీసీ స్మశాన వాటిక (వైకుంఠధామం) అభివృద్ధికి చర్యలు ప్రారంభమయ్యాయి.ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి సోమవారం వైకుంఠధామంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ స్మశాన వాటికలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైకుంఠధామాన్ని అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు త్వరలో సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.
అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయించి, ప్రణాళికాబద్ధంగా వైకుంఠధామం అభివృద్ధి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ పనులతో బీసీ స్మశాన వాటిక రూపురేఖలు మారనున్నాయని, మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని ఆమె పేర్కొన్నారు.
