ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం..!

తాండూర్ , సెప్టెంబర్ 30 ( తెలంగాణ వార్త ప్రతినిధి): గౌతాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. లీలావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ వారిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలను అందించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు.

అనంతరం పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన టీ.ఎల్.ఎం. (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) ప్రదర్శనను నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సృజన, ఉప సర్పంచ్ ఇంద్రజ, పంచాయతీ కార్యదర్శి పార్వతమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, రమాదేవి మాధురి దేవి, కల్పన వజ్ర మాల,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.