మహాత్ముడి సేవలను ప్రపంచానికి చాటేలా ఎదగాలి: కంచర్ల విజయలక్ష్మి*
ఘనంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు
కంచర్ల విజయలక్ష్మి
*తాండూరు అక్టోబర్ 2 తెలంగాణ వార్త ప్రతినిధి*
: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని కంచర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కంచర్ల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలు, సత్యం–అహింస సిద్ధాంతాలను యువత తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తాండూరు మండల పరిధిలోని రాంపూర్, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో కంచర్ల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. యువత కేవలం విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజిక సేవలోనూ ముందుండాలని సూచించారు. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రపంచ స్థాయిలో చాటిచెప్పే విధంగా యువత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తే సమాజంలో శాంతి, సామరస్యం మరింత బలోపేతమవుతాయని కంచర్ల విజయలక్ష్మి పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా గ్రామాల్లో ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో వై.పండరి అల్లాపూర్ రమేష్ నియోజకవర్గ నాయకులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు
